AP Free Bus Scheme 2024: కీలకమైన అప్‌డేట్ వెలువడింది

AP Free Bus Scheme 2024: కీలకమైన అప్‌డేట్ వెలువడింది

 

  ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత బస్సు ప్రయాణం పథకంపై కీలకమైన అప్‌డేట్ వెలువడింది. ముఖ్యంగా ఆ రాష్ట్రంలోని మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని అందించే విధానం త్వరలో అమలులోకి రాబోతోందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.

ఎన్నికల సమయంలో టీడీపీ-జనసేన కూటమి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ హామీని నెరవేర్చడానికి మరొక నెల రోజుల్లో పథకాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

AP Free Bus Scheme 2024 పథకం అమలు ప్రక్రియ

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని ఏపీలో అమలు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించింది. ఈ పథకాన్ని ఎలా అమలు చేయాలనే దానిపై పరిశీలన చేసేందుకు ఒక కమిటీని రాబోయే 15 రోజుల్లో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కమిటీ కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికే అమలులో ఉన్న ఉచిత ప్రయాణ విధానాలను పరిశీలించి, ఏపీలో అమలు చేయడానికి అనువైన విధానాన్ని రూపొందిస్తుంది.

AP Free Bus Scheme 2024 ఇతర రాష్ట్రాల మాదిరిగానే

కర్ణాటకలో మహిళలకు స్మార్ట్ కార్డులు జారీచేయడం, తెలంగాణలో జీరో టికెట్లు జారీచేయడం వంటి విధానాలను పరిశీలనలో భాగంగా భావిస్తున్నారు. కర్ణాటక మాదిరిగా స్మార్ట్ కార్డులు ఇవ్వాలా లేక తెలంగాణ విధానం ప్రకారం జీరో టికెట్లు జారీ చేయాలా అనే విషయంపై కమిటీ సిఫారసులు చేయనుంది.

AP Free Bus Scheme 2024 అమలు విధానం

  ఈ పథకం జిల్లాల లోపల, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో కూడా అమలు అవుతుందా లేదా పల్లెవెలుగు సర్వీసులకు మాత్రమే పరిమితం అవుతుందా అన్నది త్వరలోనే నిర్ణయానికి వస్తారు. అలాగే, బస్సు సర్వీసులు, దూరప్రాంతాలకు సదుపాయాల పెంపుపై కూడా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.

నిర్దిష్ట సమయం

నెలరోజుల్లోగా ఈ పథకం అమలు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టంగా తెలిపారు 

AP Free Bus Scheme 2024See AlsoAP Free Bus Scheme 2024

1. NTR Bharosa Pension : ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం 2024 పూర్తి వివరాలు

2. Chandranna Pelli Kanuka Scheme 2024 : అర్హతలు,ఎలా దరఖాస్తు చేసుకోవాలి

3. Annadata Sukhibhava Scheme 2024 : అన్నదాత సుఖీభవ పథకం పూర్తి వివరాలు

4.Pm Kisan Payment Status 2024: ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేయాలి?

AP Free Bus Scheme 2024AP నిరుద్యోగ భృతి పథకం 2024 – నెలకు రూ. 3,000  

Leave a Comment