AP Government మూడు నెలల పెన్షన్ ఒకేసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెన్షనర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ అందించారు. పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులు ఇకపై మూడు నెలల పెన్షన్ మొత్తాన్ని ఒకేసారి పొందే అవకాశం కల్పిస్తూ ఆయన అధికారిక ప్రకటన జారీ చేశారు. ఈ నిర్ణయం పెన్షనర్లకు మరింత సౌలభ్యం కలిగించడమే కాకుండా వారికి ఆర్థికంగా సపోర్ట్ అందించడంలో ప్రధాన పాత్ర పోషించనుంది.

ముఖ్యాంశాలు:AP Government మూడు నెలల పెన్షన్ ఒకేసారి
పెన్షన్లు ప్రతి నెల ఇవ్వడం కాకుండా, మూడు నెలలకు ఒకసారి మొత్తం మొత్తాన్ని అందించే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
AP Government పెన్షన్ పొందే లబ్ధిదారులు తమకు రావాల్సిన మొత్తాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా పొందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పెన్షన్లు తీసుకోవడం లబ్ధిదారుల హక్కు అని, దానిని ఎవరూ ఆపడానికి వీల్లేదని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.
ఇంటి వద్దకే పెన్షన్ డబ్బులు:
లబ్ధిదారుల సౌకర్యార్థం, పెన్షన్ మొత్తాన్ని ఇంటి వద్దకే చేర్చేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం వెల్లడించారు. ఇది ముఖ్యంగా వయసు పైబడిన మరియు శారీరక దివ్యాంగులు గల లబ్ధిదారులకు మరింత ఉపయుక్తంగా ఉండేందుకు ఈ మార్గదర్శకాలు రూపొందించబడ్డాయి.
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు:
పెన్షన్లను లబ్ధిదారుల ఇంటికి చేర్చే విధానంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. జిల్లా, మండల స్థాయిల్లో అధికారులను నియమించి, వారికి సకాలంలో సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేశారు.
నివేదికలో ముఖ్యాంశాలు:
ప్రతి మూడు నెలలకు ఒకసారి పెన్షన్ మొత్తం అందించే విధానం
లబ్ధిదారులకు ఇంటి వద్దకే డబ్బు పంపిణీ విధానం
64 లక్షల మంది లబ్ధిదారులు అందిస్తున్న ప్రభుత్వం
See Also
1.AP Jobs 2024: కలెక్టర్ కార్యాలయాల్లో ఖాళీగా వున్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
2. AP Volunteers 2024: వేతనం పెంపు మరియు కొత్త మార్పులు