AP Mega DSC 2025: నిరుద్యోగులకు శుభవార్త..మెగా డీఎస్సీపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే నిరుద్యోగులకు శుభవార్త అందించింది. రాష్ట్రంలోని పాఠశాల విద్యాశాఖ మార్చి నెలలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16,247 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ వెల్లడించిన వివరాల ప్రకారం, జూన్ నాటికి నియామక ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు తెలిపారు. జీఓ 117కు ప్రత్యామ్నాయం తీసుకొస్తామని పేర్కొంది.
AP Mega DSC నోటిఫికేషన్ విశేషాలు
- స్కూల్ అసిస్టెంట్లు (SA) – 7,725 పోస్టులు
- సెకండరీ గ్రేడ్ టీచర్లు (SGT) – 6,371 పోస్టులు
- ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (TGT) – 1,781 పోస్టులు
- పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGT) – 286 పోస్టులు
- వ్యాయామ ఉపాధ్యాయులు (PET) – 132 పోస్టులు
- ప్రిన్సిపాల్స్ – 52 పోస్టులు
జీఓ 117కు ప్రత్యామ్నాయ ప్రణాళిక
కోన శశిధర్ తెలిపిన ప్రకారం, గతంలో టీచర్లకు 45 రకాల యాప్‌లు ఉండేవని, వాటన్నింటినీ ఒకే యాప్‌గా మార్చినట్లు చెప్పారు. అదేవిధంగా, త్వరలో టీచర్ల బదిలీల చట్టాన్ని తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. ఈ బిల్లు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.
విశ్వవిద్యాలయాల కొత్త చట్టం
వీసీల నియామకం పూర్తయిన తర్వాత రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు ఏకీకృత చట్టాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు.
న్యాయపరమైన జాగ్రత్తలు
ఈ AP Mega DSC ప్రక్రియలో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు విద్యాశాఖ ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది. నియామక ప్రక్రియ వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది.
ఈ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మార్చిలో నోటిఫికేషన్ విడుదలైన వెంటనే అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి.
MGNREGS 2025: వారందరి జాబ్ కార్డులు రద్దు..ఉపాధి హామీ కూలీలకు కేంద్రం షాక్!
Aadhar 2025: ఆధార్ సేవల్లో తాజా మార్పులు..ఇవి లేకుంటే అంతే సంగతులు!
PhonePe Loan Telugu: PhonePe ద్వారా 5 లక్షల రుణం పొందడం ఎలా? పూర్తి వివరాలు
Tags
Mega DSC 2025 Notification, Andhra Pradesh Teacher Recruitment, AP DSC Latest News, 16,247 Teacher Jobs in AP, Government Teacher Jobs 2025, AP DSC Exam Dates, Teacher Vacancies in Andhra Pradesh, School Assistant, SGT, TGT, PGT Jobs, Andhra Pradesh Education Department Updates, AP DSC Official Notification.