Farmers 2025: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు అకౌంట్లో పడతాయంటే..?

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Farmers 2025: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు అకౌంట్లో పడతాయంటే..?

వాలెంటైన్స్ డే సందర్భంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 19వ విడత పీఎం కిసాన్ నిధుల విడుదల తేదీని ఖరారు చేసింది. 2025 ఫిబ్రవరి 24న రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నిధులు జమ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ రోజున ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ రాష్ట్రంలోని భాగల్పూర్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రత్యక్ష నగదు బదిలీ పద్ధతిలో పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనున్నారు. అలాగే, బీహార్‌లోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. అనంతరం భాగల్పూర్‌లో ఏర్పాటు చేసే సభలో మోడీ ప్రసంగించనున్నారు.

ఇవి కూడా చూడండి

ఇవి కూడా చూడండి:

పీఎం కిసాన్ పథకం వివరాలు: 2019లో ప్రారంభమైన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం ద్వారా చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక సహాయం అందించబడుతుంది. అర్హులైన ప్రతి Farmers కు ఏడాదికి రూ.6,000 (రూ.2,000 చొప్పున మూడు విడతల్లో) అందించబడుతుంది. ఈ నిధులు ప్రత్యక్ష నగదు బదిలీ (Direct Benefit Transfer – DBT) ద్వారా రైతుల ఖాతాల్లో జమ చేయబడతాయి. గత విడతగా 2024 అక్టోబర్ 5న 18వ విడత నిధులు జమ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు 19వ విడత నిధులను 2025 ఫిబ్రవరి 24న విడుదల చేయనున్నారు.PM KISAN 2025

పీఎం కిసాన్ స్కీమ్ అర్హతలు:

  • భారతీయ పౌరుడు అయ్యి ఉండాలి.
  • చిన్న లేదా సన్నకారు రైతుగా గుర్తింపు పొందాలి.
  • సాగు భూమిని కలిగి ఉండాలి.
  • నెలకు కనీసం రూ.10,000 పెన్షన్ పొందే పదవీ విరమణ చేసిన వ్యక్తి కాకూడదు.
  • ఆదాయపు పన్ను దాఖలు చేయకూడదు.
  • వ్యవసాయేతర భూమి లేదా సంస్థాగత భూస్వామిగా ఉండకూడదు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?

  • పీఎం కిసాన్ యోజన పథకానికి ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.
  • Pradhan Mantri Kisan Samman Nidhi అధికారిక పోర్టల్‌ను సందర్శించాలి.
  • “Farmers Corner” క్లిక్ చేయాలి.
  • “New Farmers Corner” క్లిక్ చేసి ఆధార్ నంబర్, రాష్ట్రాన్ని ఎంచుకోవాలి.
  • Captcha కోడ్‌ను టైప్ చేయాలి.
  • లబ్దిదారుడి వివరాలను ఎంటర్ చేయాలి.
  • బ్యాంకు ఖాతా, వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని ఎంట్రీ చేయాలి.
  • సబ్మిట్ బటన్‌ను క్లిక్ చేయాలి.
  • ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC)ను సందర్శించి దరఖాస్తు ఫారం పూర్తి చేయాలి.

పీఎం-కిసాన్ eKYC పూర్తి చేయడం ఇలా..

  • పీఎం-కిసాన్ అధికారిక వెబ్‌సైట్ (https://pmkisan.gov.in/)ను సందర్శించాలి.
  • కుడి వైపున అందుబాటులో ఉన్న eKYC పై క్లిక్ చేయాలి.
  • ఆధార్ కార్డు నంబర్‌ను ఎంటర్ చేయాలి. అనంతరం Captcha కోడ్‌ను నమోదు చేసి సెర్చ్ పై క్లిక్ చేయాలి.
  • ఆధార్ కార్డుతో లింక్ అయిన మొబైల్ నంబర్‌ను ఎంట్రీ చేయాలి.
  • “Get OTP” పై క్లిక్ చేయాలి. వచ్చిన OTPను నమోదు చేయాలి.
  • అన్ని వివరాలు సరైనవి అయితే eKYC ప్రక్రియ పూర్తవుతుంది. ఒకవేళ ఏదైనా సమస్యలు ఎదురైతే స్థానికంగా ఉన్న ఆధార్ సేవా కేంద్రాన్ని సంప్రదించాలి.

 

pm kisanFree Bus Scheme 2025: ఏపీలో ఉచిత బస్సు ఇక జిల్లాలకే పరిమితం చేసిన ప్రభుత్వం

pm kisanDigital Ration Cards 2025: ఏపీలో ఇకపై క్యూఆర్ కోడ్ తో రేషన్..త్వరలో డిజిటల్ కార్డులు

Tags

PM Kisan, PM Kisan 2025, PM Kisan19thInstallment, PM Kisan Funds, Farmers Scheme, PM Kisan Payment, Direct Benefit Transfer, Indian Farmers, Agriculture News, Farmers Welfare, PM Kisan Yojana, Modi Government, Farmers Support, PM Kisan Updates, Govt Scheme, Financial Assistance, DBT, Agriculture Scheme, PM Kisan EKYC, How To Apply PM Kisan, PM Kisan Eligibility.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Comment

WhatsApp